భవిష్యత్ దృశ్యాలు
తేది: 21-08-2020
శీర్షిక: బంగారుమయం చేసుకుందాం....
సంఖ్య : 495
సంప్రదాయాలలో సదా అగ్రగాములమని
చంకలు గుద్దుకుని సంబరపడదామా ....
పెద్దలు చెప్పినవన్నీ చాదస్తాలంటూ
సుద్దుల మాటలు గాలికొదిలేద్దామా....।
స్వచ్ఛభారతన్నా... కదలక మెదలక
ఇచ్చానుసారమే బతికేస్తున్నం .....
ఇంటి చుట్టూరా పెంటకుప్పలు
ఊరి చుట్టూరా చెత్తా చెదారం
ఉరి బిగించుకుని ఊరేగుదామా....
దశలు మారుతున్న పర్యావరణం
దగా పడుతున్న బతుకులు మనవి
దశాబ్దానికో కొత్త రోగమన్నది నిజం
దండి వైద్య ఖర్చుల జనం సతమతం .....
"మంచి" నీటిని కొంటున్నాం.
గాలిని కూడా కొందామా ?
వద్దు!! వద్దు!!
ప్రభుత్వ పథకాలేవైనా
ప్రజలు కూడా పాటిస్తేనే
ప్రగతి చక్రం పదిలం సుమా!
మాటే మంత్రమై బతికేద్దాం....
భవిష్యత్ దృశ్యాలను మనమంతా
బంగారుమయం చేసుకుందాం ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment