శీర్షిక: లలిత గేయం
సంఖ్య: 468
ఆడెదమా పాడెదమా
ఆనంద కీర్తనం //2//
గల గలా గోదారి
కదిలె కదా గంగమ్మై
త్రయంబకాన పుట్టింది
తల్లి చేరు సాగరాన.... // ఆడె//
నాసిక్ పైథాన్ లు
నాందేడుల మీదుగా
పెన్ గంగ వైన్ గంగలు
పెనవేసుక పెన్నిధిగ // ఆడె//
మంజీర మానేరులు
మాగాణుల రారాజులు
మనసైన పంటలకు
తెలంగాణ రైతున్నకు // ఆడె//
ధర్మపురి నృసింహుడు
కాళేశ్వర ముక్కంటి
భద్రగిరి శ్రీరాముడు
అందంగా అమరిన
ఆధ్యాత్మిక కేంద్రాలు // ఆడే //
ప్రకృతికే వన్నెలద్దె
పాపికొండల రమణీయం
పట్టిసీమ కోనసీమ
పరవశించె కమనీయం // ఆడే //
చీకటిలో కాంతిరేఖ
చిన్నా పెద్ద రాష్ట్రాలకు
తాగునీరు సాగునీరు
నీ చలవే కన్నతల్లి // ఆడే //
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment