కునుకు పడితే...
తేది:24-07-2020
శీర్షిక: దివ్య ఔషధం.....
సంఖ్య: 473
కునుకు పడితే మనసే కాదు
తనువు కూడా కుదుటపడుతది
దింపుకున్న బరువోలె తేలికవుతది
దైవమే అభయమిచ్చినట్టు మాయమౌతది
తనువు మనసుల తండ్లాటలో
తులన సంతులితల కేంద్ర బిందువు
చంచలమైన మనస్సుకు సేదదీర్చే
అచంచలమైన దివ్య ఔషధం.....
పిల్లలకైనా పెద్దలకైనా కునుకులో
మునక భలే గొప్ప ఆరోగ్య కానుక...
చిందర వందర చికాకులను సుందర
తీరాలు చేర్చే ఆనంద స్వప్నాల భరిణె....
స్వతహాగా కునుకందుకునే
సంపన్నుడికైనా...అవసరానికి
ఆదుకునే మందులకైనా .....
జల్సాలకు జాలిపడే మత్తులైనా ....
గమ్మత్తుగ సమమే సమకూరు...
ఆకలి రుచెరగనట్టు నిద్ర
సుఖం కోరదు పట్టు పరుపులైనా
కటిక నేల మట్టి కుప్పలైనా పట్టును కదా...
కునుకులు పట్టింపులు లేక ....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment