సంగీత సౌరభాలు
తేది: 25-08-2020
శీర్షిక: విశ్వ వ్యాపితం ....
సంఖ్య: 498
వింత వింత శబ్దాలే
వీనులకు విందులాయె ....
రాగం తాళం పల్లవి కలిసి
శ్రుతి లయలతో జతకడితే
రంజింపదా రాతి గుండె సైతం ....
పరికిస్తే పట్టుబడదా... అడుగడుగున...
పల్లవించే ప్రకృతమ్మ ఒడిలోన...
వీచే గాలిలో ....ఊగే పైరులో .....
సాగే నీటిలో.......ఎగిరే పక్షిలో ........
మారునేమో ప్రాంతాన్ని బట్టి
మనిషి మనిషికో సంగీతం...
మనసు మాత్రం లయబద్దం
పశువైనా శిశువైనా స్పందన ఖాయం....
నారాయణుడే ఆద్యుడైనా
నారదుడు తుంబురుడైనా
వీణాపాణి విమల స్వరూపిణైనా
నాదోపాసకులే.... సంగీతప్రియులే....
అరువది నాలుగులో అంతర్లీనమైనా
ఎల్లలెరుగదు సంగీత సామ్రాజ్యం
సాహిత్యంతో సమవుజ్జీగా నిలిచి
రసరమ్యమై రంజింప చేసేదే
విశ్వ వ్యాపితం సంగీత సౌరభం....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment