గురువు గేయం
తేది : 05-09-2020
శీర్షిక : గురువా వందనం
సంఖ్య : 508
గురువా వందనం
సద్గురువా వందనం
అమ్మా నాన్న లైనాక
ఆది గురువు నీవయ్యి
ఆశీస్సులనందించే
ప్రత్యక్ష దైవమయా //గురువా//
అక్షరాల మాంత్రికుడా
లక్షణంగ సదువు చెప్ప
లక్ష్యాలను చేదించి
ఉన్నతంగ నిలబెట్ట
// గురువా //
పల్లె పల్లె చేరి నీవు
పాడిపంటల రైతులెక్క
పిల్లలందరి సదువులను
పాణమోలె సూసుకుంటివి
// గురువా //
తల్లి దండ్రుల పాత్ర నీవై
సుద్ది బుద్దులు నేర్పినావు
తీర్చి దిద్ది పెట్టినావు
పిల్లల తీర్చి దిద్ది పెట్టినావు
// గురువా //
తరువు లెక్క నీడనిచ్చి
మంచి పెంచి ప్రోత్సహించి
అడుగడుగున కాసుకొని
ముందుకు నడిపించావే
// గురువా //
ఆట పాటలు నేర్పించి
అనుపానులు బోధించి
ఆరి తేర దీసినావే
రత్నమోలె జేసినావే
// గురువా//
దేశ భవితను తీర్చిదిద్ది
జాతికీర్తిని ఇనుమడించి
వృత్తులలో నీ స్థానం
ఉన్నతంగా మలిచావే
// గురువా//
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment