నా కలల తెలంగాణా
అరువదిల్లో ఆగమైన
చదువులమ్మ ఒడిలోన
స్వార్థాలను చంకనేసుకున్న
వక్రబుద్ధి నాయకులవలన ....
వలస నాయకుల పాలనలో
వట్టిపోయిన తెలంగాణ
నీళ్లు నిధులు నియమాకాలంటే
నిజమే కామోసనుకున్నా ......
మలివిడతన ఉద్యమాన
మలయమారుతంలా మొదలై
తుఫానులా విస్తరించి
సునామీలా చుట్టుముట్టింది ....
ప్రత్యేక తెలంగాణ సంబరం
పైవారికి అందించెను గీతం
కిందనెమో అప్పనంగా సబ్సిడీలు
మధ్యవారికి మస్తుగ పన్నులు. ....
సంక్షేమం సంక్షేమం అంటూనే
అడిగినోళ్లకు అడగనోళ్లకు
అందరికి పంచుతున్నరు
ఆముదాలు రాస్తున్నారు ......
జనం కస్టపడి కట్టిన పన్నులు
అగ్గువచ్చిన ఆదాయమని .....
బంగారు తెలంగాణన్నరు
బాకీల తెలంగాణయ్యింది ......
No comments:
Post a Comment