అంశం - నిశ్శబ్ద సంగీతం
తేదీ 28-06-2019
శీర్షిక - కళా తపస్వి ...
సంఖ్య - 222
భావ ప్రకటన ప్రచారానికి శతాబ్దాలుగా
బాటలు వేసింది మన నాటక రంగం
బహుళ ప్రాచుర్యం పొంది అనతి కాలంలోనే
బహువిధ ప్రయోజనాలను మూటగట్టింది.
సాంకేతికతకు సొబగులద్దుకుని మూకీలుగా
సవాళ్ళను ఎదుర్కొని మూవీలుగా నిలిచి
తెలుపు నలుపుల కాంతి మిశ్రమాలతో
సంబరాలనే పండించింది ప్రతి ఇంట ....
సెల్యులాయిడ్ పరిశ్రమ విశ్వ విజేతయై..
పౌరాణికాలను పవిత్రంగా పండిస్తూనే ....
చారిత్రకాలను చతురంగా చిత్రీకరిస్తూనే ....
సాంఘికాలతో సమకాలీన సమస్యలకు
చక్కటి సలహా సూచనలిస్తూ సాగుతుంది.....
కుటుంబ కథలతో కుళుకులీనుతూ
సప్త వర్ణాలతో సవరించుకుని ముస్తాబై
ప్రయోగాత్మకాలతో ఫరడవిల్లుచున్న
ఒకానొక శుభ నక్షత్ర సుముహూర్తాన...
కాలిడిన కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారు
ఆత్మగౌరవంగా ఆరభించినా సిరిసిరిమువ్వగా మారి ....
పాశ్చాత్య సంగీత హోరులో పడి లేస్తున్న సమయాన
సంగీత ప్రపంచాన్ని నిశ్శబ్దంగా ఉర్రూతలూగించారు
భారతీయ సాంప్రదాయపు సౌందర్య సౌరభాలతో....
అలవోకగా ఆవిష్కరించారు శంకరాభరణం తో .....
అందుకున్నారు పద్మశ్రీ బిరుదు భారత సర్కారుచే ....
No comments:
Post a Comment