అంశం - వయసు మనసు
తేదీ - 29-06-2019
శీర్షిక - విలువలు జోడించాలి....
సంఖ్య - 223
వయసు సంఖ్యాత్మకంగా ప్రదర్శితమైతే
మనసు గుణాత్మకంగా ప్రదర్శితమౌతుంది
అయినా వయసుకు మనసుకు అవినాభావం
బుద్ది నేర్చిన వాడే పెద్దోడు అన్నట్టు....
కొంతమందికి మాత్రం పొంతనుండదు....
బాల్యమెంతో బంగారుమయం
తమ పర అను భేదమెరుగం....
మంచి చెడుల మర్మం తెలియం...
కష్ట సుఖాల బాధ్యతలెఱుఁగం ....
అందరితో మమేకమౌతాం .....
కౌమారం యవ్వనం రంగుల ప్రపంచం
తెలిసి తెలియని వయసు ప్రమాదం
ఆలోచనలు అనంత విశ్వం చుట్టొస్థాయి...
అనుభవాలు నియంత్రిస్తే అసహనం....
వయసు నిమిత్తం లేకుండా
మనసు చేయు అనేక ఆలోచనలు....
సక్రమమైతే సంతోషమే కానీ ....
ఆలోచనలు అదుపు తప్పితే విధ్వంసం
వయసు మందలించినా మనసు మాట విననంటుంది ....
గిర్రున తిరిగి చూసుకునే లోపు
సర్రున చివరి మజిలీ చేరుతాం.....
జరిగినది తలుచుకుని మనస్సాక్షికి
మన్నింపు కోరుకుని సంజాయిషీ ఇచ్చుకునే
సందర్భాల సంధ్య పొద్దులవసరమా.....
అందుకే...
అనుభవాల వయసులకు....
ఆనందాల మనసులకు ....
అనునిత్యం విలువలు జోడించాలి....
No comments:
Post a Comment