Saturday, July 13, 2019

వెంకటేశ్వరా వందనమయ్యా !

వెంకటేశ్వరా వందనమయ్యా !
ఏలుకొమ్మని వేడినం (వేడితిమయ్యా) 

జోలపాడి నిను బుజ్జగించిన 
అన్నమయ్యకు వందనం .... (2)
ఓ స్వామీ నీ జాడ తెలియలేక 
కంటికి కునుకే రాదయ్యా .....(2) //వెంక// . 

ఏడు కొండలెక్కి నిన్ను 
చేరినాము స్వామీ 
వేంకటేశ నీకు వే వేళా వందనాలు(2)
ఓ స్వామీ నీ రూపు చూడలేని 
ఈ జన్మమెందుకయ్యా       (2)   //వెంక //

మాకు నీవు తప్పా 
దిక్కెవరు లేరు స్వామీ 
మా ప్రభువ శ్రీనివాసా 
సిరులేమి అడుగలేదు      (2) 
ఓ స్వామీ మా దేహమంత నీవే 
మా సర్వం నీవయ్యా         (2)  //వెంక //

తిరుమలేశ నీకు 
జేజేలు పలికినాము  
మా ప్రాణమంతా నిన్ను 
మనసారా గొలిచినాము        (2)
ఓ స్వామీ అలివేలుమంగవాసా 
మరి మరి పూజింతుమయ్యా (2) //వెంక //
 

No comments:

Post a Comment