Monday, July 22, 2019

పాద రక్షలు

అంశం - పాద రక్షలు 
తేదీ -  22-7-2019
శీర్షిక  -స్వగతం...  
సంఖ్య - 242

అజ్ఞాన తిమిరాన అంధకారాలు తరిమి  
జ్ఞాన జ్యోతులు వెలిగించు గురువులకు  
కర్ర పావుకోళ్లుగా కాళ్ళను అలంకరించాము ....  

పాదాలకు సమాంతరముగా పలుచగానైనా  
ఎత్తు మడిమలతో చిత్తడి సోకులు పడినా .....
అరవిరిసిన అందాలు ఒలకబోసే  శాండీలైనా ....  
నలు చెరగుల అందర్నీ  మెప్పించ మాకే చెల్లింది 

నాగరికతల నీడల్లో నడకలు నేర్చిన తరుణాన 
తోలు ముక్కలకు రంగులద్దుకుని వన్నెలతో కులుకుతున్నాను ....
రబ్బర్ ప్లాస్టిక్కులతోడ రకరకాల రాటు దేలి నిలిచాను....  

పర్యావరణ పదిలానికి  జనపనార కలుపుకున్నాను 
ప్రజల మదులు దోసుకోను పలు రకాల లేసులేసుకుని 
వగలమారి అందాల చమికీలు పూసలు రాళ్ళ లేపనాలద్దుకున్నాను ..... 
వివిధ కాలాలకై  విచిత్ర ఫర్ లతో కూడ ముస్తాబయ్యాను ....   

ఆటపాటల్లోన  ఆరితేరి నిపుణతగా నిలిపినా .....
కాయ కష్టాల కార్మికుల చమట చుక్కల  గమ్ము (త్తు)బూట్లైన    
కార్యాలయాలలో సుందరంగ సూటు బూటుకైనా 
కరెంటోళ్ల కష్టాలకు కవచమై నిలిచాను  ... 

సరిహద్దు పొడుగునా సైనికుడిని హత్తుకుని..... 
నా అడుగు జాడలలో దేశ భధ్రతను భక్తిని భుజాన వేసుకు మోస్తున్నా ... 
పారిశ్రామికంగా ఫరడవిల్లి  శ్రామిక ఆర్థిక శక్తిగా ఎదిగి  
ముందుతరాలకు బతుకు భరోసాలు నింపుతున్నాను .....    

అప్పుడప్పుడు : 
పనికి మాలిన దద్దమ్మల పళ్లూడగొట్ట   
ప్రజల చేతిలో  నేను పాశుపతాస్త్రాన్ని...  
సభా జన సంద్రాలలోన  నిరసనలు తెలుప   
అడపా దడపా వార్తా పత్రికల పతాక శీర్షికనౌతాను...  


నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం USA)
... 

No comments:

Post a Comment