Sunday, July 21, 2019

రాధామాధవీయం

అంశం - రాధామాధవీయం
తేదీ - 19-07-2019
శీర్షిక - ప్రేమ మూర్తులు
సంఖ్య - 240

పడమటి సంధ్యారాగంలో అరుణవర్ణాలు 
మెల్ల మెల్లగా కృష్ణయ్య రంగు సంతరించుకోగానే 
మంద్ర గమనమైన యమున తటి
పిండి వెన్నెలను దండిగా వెదజల్లుతున్న
చంద్రుని రాకతో ఉవ్వెత్తున ఎగిసిపడినది
నల్లనయ్యను ప్రేమిస్తున్న ఎంతో మంది
గోపికలంతా ఆర్తిగా ఎదురుచూస్తున్నా.... 

వెదురు కర్ర స్వామికి అందించిన....
స్వార్థమెరుగని సాన్నిహిత్యంతో
మోహంఎరుగని ప్రేమతత్వంతో
స్వామి సుఖమే తన పరమావధిగా 
తనను తాను  స్వామికి అర్పించుకుని 
శూన్య స్థితికి చేరుకొని స్వామి చేతనే
తనను పలవరించేంత ప్రేమను పంచి 
తానే స్వామిగా మారి...  స్వామిని    
ప్రేమ భక్తితో బంధించుకో గలిగిన  
రాధమ్మ మాత్రం అలౌకికానందంలో
తన్మయత్వంగా లీనమై యున్నది.

అష్ట భార్యలకు సైతం అందని 
భావనా సంతృప్తుల భక్తి మీరంగ 
అమలిన శృంగారం ఆచంద్ర తారార్కమైన 
ప్రేమను పొందిన రాధమ్మ జన్మ ధన్యం.... 

అందుకే యుగాలు మారినా 
జగాన ఈనాటికి ప్రేమ నిర్వచనం 
పెన్నిధిగా రాధామాధవీయం...... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం USA)

No comments:

Post a Comment