Saturday, July 13, 2019

వాలు జడ

వాలు జడ 
తేదీ - 10-07-2019
శీర్షిక - భారతీయతకు ముద్రితం... 
సంఖ్య - 232

సహజ సౌందర్యాల సాదా జుట్టైనా 
గిరికీల వంకీల రింగుల జుట్టైనా  
మహిళలకు మాత్రం గొప్ప శోభనిచ్చు 
మగవారికేమో మతులు చలించు..... 

మరువ ధవనాలకైనా 
మల్లె చేమంతులకైనా 
వనితామణులకది సింగారం 
వాలుజడల వయ్యారం.... 

ప్రియరాగాల తొలి ప్రేమలకైనా 
పతిదేవుని రేయి ప్రణయాలలోన  
అందమును ఇనుమడించు 
ఆమెకు చందమై  ఆకర్షించు....

అలుకల పూబోణి కొలికిలకు 
సుతారానా పతి చెంపలు జేర  
జగనపు సిరి మగువలకు 
జడ గంటలు సేద దీర ...... 

విశ్వమెల్ల విశదముగా 
భారతీయతకు ముద్రితం... 
వాలుజడల సంప్రదాయం...  
భారమాయె ముదితకు ఈదినం......
భరత మాత బిడ్డలకు సైతం..... 

  

No comments:

Post a Comment