అంశం - తొలిఏకాదశి
తేదీ - 11-07-2019
శీర్షిక - సుందర జీవన సారం ....
సంఖ్య - 233
పంచభూతముల మయమైన ప్రకృతి ఇంట
జ్ఞానేంద్రియాల గణములు తోడు నిలిచిన
పంచేంద్రియాల మర్మపు మానవ ఆకృతికి
పరమ విశిష్టం మానసిక అనుసంధానం .....
ఆయనాల మార్పున వర్ష ఋతువేతెంచ
ఆతురములు తగ్గిన ఆనవాళ్లు పెరుగునని
ఆతురములు తగ్గిన ఆనవాళ్లు పెరుగునని
ఆషాఢమరుదెంచి నిశి పరిమాణం పెరగంగ ...
అలసత్వములు పెరిగి అరుదెంచు జాడ్యమని ...
పర్యావరణమందు పల్లవించు మార్పుల వేళ
పలు విధ సూక్ష్మ జీవులు మెండటంచు...
పతనపరుచు మానవ ఆరోగ్యాలటంచు ....
పరికించె భువిన పాటి అనుభవజ్ఞులు ....
దక్షిణాయనమ్మున నిండు పండగలు జేరి
నియమిత కాలానుగుణంగ నిమంత్రించె ...
ధరణి జనులనెల్ల దండిగా పాటింతురు
ఆరోగ్యాల ఆదిమూలం పరిశుభ్రతలటంచు ....
ప్రార్థనా పఠనం పలు విధాల మేలటంచు...
వేదోపనిషత్తుల పురాణేతిహాసాల బోధనా సారమైన....
ఆచార సాంప్రదాయాల పాలనా మర్మమైన ....
ధార్మిక ధాతృత్వాల సంకల్ప మనోవ్రతమైన....
పూజా పునస్కారాల ఆచరణ ఫలితమైన....
అవి ఎల్ల దర్శింపు గమ్య గమనముల
అంది పుచ్చుకునిరి జనులు ఆది చైతన్యం....
ఆషాఢ బహుళ తొలి ఏకాదశి పర్వాన
ఆనందాలు పొందుటే సుందర జీవన సారమంటూ....
ఆరాదింతురు స్థితి కారక అనంత శయనున్ని...
No comments:
Post a Comment