అంశం - పేపరుబాయ్
తేదీ - 13-07-2019
శీర్షిక - అణు శాస్త్ర యోధుడు ... అబ్దుల్ కలాం
సంఖ్య - 235
నిశి తెరలు పూర్తిగా తొలగకముందే
చుక్కల్లో సంచరించే చంద్రుల వలె
వెలుగు రేఖల నులి వెచ్చని కాంతుల్లో
చక చక బయలుదేరు సైకిలెక్కి....
ఋతువేదైనా గతి తప్పనీయరు...
కాలమేదైనా చలనమే శ్వాసిస్తారు .....
మెండుగా కదిలివెళ్లే సాహిత్య దండు ....
భాష ఏదైనా భావం చేర్చుతారు ....
వేల కోట్ల పరిశ్రమలకు వేయికాళ్ల జెర్లు
లక్షల మందికి లక్షణమైన మార్గం....
స్వతంత్ర భావాలో స్వావలంభనలో....
సరంగులు వారే సమయ కాల చక్రానికి....
కనీస ప్రతిఫలానికే కష్టించి పని చేసినా ....
కోట్లాది ప్రజల మనసులు దోచుకుంటారు
గుర్తించబడని గుంభన కథనాలెన్నున్నా..
గురి కుదిరే మణి మాణిక్యాలైన వారు మచ్చుకు ....
రామేశ్వరాన రగిలి వెలిగించుకొన్నపేపర్ బాయ్
శాస్త్ర సాంకేతికతలో సమున్నత విశ్వ విజేతగా నిలిచి
రాజధానిలో రారాజు పీఠమెక్కిన ఘన సంపన్నుడు
అతనే మన ఆదర్శ అణు శాస్త్ర యోధుడు ... అబ్దుల్ కలాం గారు....
No comments:
Post a Comment