అంశం - జగన్నాథ రథ చక్రాలు
తేదీ - 04-07-2019
శీర్షిక - విశ్వవిఖ్యాతం ...
సంఖ్య - 227
ద్వాపార యుగం నాటి మాట
దేవకీ వసుదేవుల సంతానమై
ఇంటిలోని అధర్మాన్ని తుదముట్టించి
యశోద నందుల ఇంట పెరిగి
ప్రేమానురాగాలకు పెన్నిధియై
అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ
అనుబంధాలను అజరామరంగా నిలిపి
యుగాలు మారినా అండగా నేనున్నానంటూ
అశేష జనవాహినికి ఆత్మీయతలు పంచే యాత్ర....
స్వార్థం వీడమని సంకేతించి
ధర్మాచరణే జీవితాన దండిదని
ఫలితామాశించక పయనించమని
అన్నీ తన భారమంటూ అభయమిచ్చి
చిరునవ్వులు సదా చిందిస్తూనే
గీత బోధనలతో జాతిని ఏకం చేసిన
చిన్మయ మూర్తికి ....... చంద్రునికో నూలుపోగులా....
భగవంతుడి గొప్పదనాలను
భవ్యమైన కోటికాంతుల ప్రభలను
బ్రతుకు పోరాటానా మరువకుండా
భక్తుడి గుండెల్లో కలకాలం నిలవాలంటూ
జగాలను శాసించే జగన్నాధ రథ యాత్ర...
విశ్వాసాలను యుగ యుగాలుగా
విశ్వపు అంచులదాకా నిలిపిన యాత్ర....
No comments:
Post a Comment