Sunday, July 21, 2019

రాగద్వేషాలు

అంశం - రాగద్వేషాలు
తేదీ - 20-07-2019
శీర్షిక - వ్యసన విముక్తతే .. మోక్షం
సంఖ్య - 241

మనిషి మానసమే వింత విహంగం
విహంగ రెక్కల పొదుగుల్లో విహరించే
విషపు చుక్కల చిత్త వృత్తి అనుపానులే
మనసున ఉద్భవించే త్రయోదశ రాగ ద్వేషాలు ......
తద్వారా ప్రస్ఫుటించే  సప్తవ్యసనాలైనా .....
అవేవి పర తమ బేధం పాటించవు ....
రాజు పేద తారతమ్యం ఎరుగవు....

రాగ ద్వేషాలు రంజిల్లే మానసం
బంధాలకు దాసోహమంటుంది.... 
రాగం నిండితే  కోరికలకు మూలం
వ్యసనాలను వంటబట్టిస్తుంది....
ద్వేషం అసూయ క్రోధాలకు పుట్టిల్లు

రామాయణ మహాభారతాలు           
మానవాళికి మహాకావ్యాలే కాదు...
ఏమి చేయాలో ఎలా చేయాలో
ఏమి చేయకూడదో ఎలా చేయకూడదో
యుగాలు మారినా జగాన కరదీపికలై
ఎప్పటికప్పుడు విశదీకరిస్తున్నాయి ....

గీత బోధనల అమృత సారం
నేటికి విశ్వజనీన ఆమోద పాత్రం
శరీరం  ఇంద్రియాల ఆధీనం
ఇంద్రియాలు మనసుకు  ఆధీనం
మనసు  బుధ్ధికి  అధీనం ,
బుధ్ధి  ఆత్మకు అధీనం... 
ఆత్మ సాక్షికి సవ్య సమాధానమే ముక్తికి మార్గం......
అందుకే వ్యసన విముక్తతే వినమ్రమైన మోక్షం....


నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

వ్యసనాలకు బందీ అవుతే బద్దుడు....
వ్యసనాల నుండి బయటపడితే బుద్ధుడు ....

No comments:

Post a Comment