అంశం - వ్యసనం
తేదీ 02-0702019
శీర్షిక - దుర్వ్యసనాన్ని దునుమాడు...
సంఖ్య -225
జీవకోటిలోనే ప్రకృతి వరం
మానవ జన్మకు మాత్రం ప్రత్యేకం
విజ్ఞాన విచక్షణల సమాహారం
గెలవాలి మనం ప్రతి నిమిషం ....
వ్యసనం వ్యవహారాలను కుంటు పడేసి
కుటుంబాలను బజారు కీడ్చు...
విజ్ఞానాలను మరుగుపరిచి
వివేకాలను నశింపజేయు ....
శాస్త్రం కొన్నింటినే సవివర పరచ
కాలానుగుణంగా కలుషితం చేయు
సంఘంలో మాత్రం సదా నూతనం ..
అన్ని మాయమయి అమరింది నేడు
అరచేత విశ్వమంటూ అందరి దృష్టి
ఆండ్రాయిడ్ ల పైన ఆత్మీయతలు పెరిగి
ఇన్ స్టాగ్రాముల మీద ఇష్టాలు పెరిగి
ఫేస్ బుక్కేమో పెన్నదై నిలిచె
స్క్రీనేజర్స్ తొడ చిక్కులెన్నో పెరిగి
సమస్త మానవత్వానికే మచ్చై పొడజూప .....
విద్య విచక్షణలతోడ విరబూయు...
వివేకం విజయాలను సమకూర్చు...
దుర్వ్యసనాలను దునుమాడి
సద్వ్యసనాలను సన్నుతిస్తూ
అడుగు వేయడమే నిత్య జీవనం ...
No comments:
Post a Comment