అంశం - మంచి - మంచు
తేదీ - 18-07-2019శీర్షిక - పంచు పరిమళాలు ....
సంఖ్య - 239
శరదృతువేతించి కార్తీక మరుదెంచ
నిత్య తుషార బిందువుల భూపాల రాగం
నిగ నిగల మెరువంగ గరక పూల హారములై
నిజ శోభ కలగదా అందాల అవని ప్రకృతికి ....
అమృతమయమైన అమ్మానాన్నల పెంపు
ఆనందమైన అనన్య గురువుల బోధనలు
అమూల్యమైన పొరుగుల సుగంధ స్నేహాలు
అనితరమైన పాలకుల మంచి వాతావరణం
అచ్చు పోయావా మచ్చుకు మనిషి మస్తిష్కాన....
మంచి మనసుల సైనికులే మనకు అండ
భూతల సైన్యం వాయు సేన నావికాదళం
అన్ని కాలాలయందు అగచాట్లు భరిస్తూ
భూరిగా మనను కంటికి రెప్పగా కాచుకున్నా
కనికరించమెందుకో కనీస గుర్తింపుగా ......
మంచు కొండల హిమాలయాలే మనకు పూదండ
అనన్య ఆధ్యాత్మిక ఆలయాలకు నిలయమై
విశిష్ట సంస్కృతిని శిఖర సమంగా మూటగట్టి
విశ్వ జగతిన వినీలాకాశంలో నిలిపి ....... ...
కాలానుగుణంగా కదిలి ప్రవాహామై
జీవ నదులుగా ప్రవహిస్తూ జన జీవనాన
త్రాగునీరై పంట పొలాలకు సాగు నీరై
సిరులు నింపే మన ఇంట.......
నిర్మలమైన మనసున నిలుచు మంచి...
నిర్మలమైన నీరిచ్చి గెలుచు మంచు....
నిశ్చల స్థితిన వెదచల్లు చల్లందనాలు....
ఆనక సైతం అమరమై పంచు పరిమళాలు ....
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం: USA)
No comments:
Post a Comment