Sunday, July 21, 2019

మెదడుకు పట్టిన చీడ

అంశం - మెదడుకు పట్టిన చీడ
తేదీ 16-07-019
శీర్షిక - సాధనమున సద్గుణములు.. మనం సాధించవచ్చు  
సంఖ్య - 237 

బాల్యమంతా బ్రహ్మ సమం
ఇల్లు ఇరుగు పొరుగు కలిసి  
పుట్టి పెరిగే వాతావరణమే 
మనిషి మార్పుకు మేలి మూలం... 
 
మనిషిగా మారు సమయాన 
కొదువ లేదు మలినాలు చేర 
స్వార్థ చింతనలు అసూయ మంతనాలు 
సద్గురువు కరువైన సంఘమున స్వారీచేయు.... 

పడతులన్న అమ్మ ఆలి అక్క చెల్లెళ్ళే కదా.... 
పరుతురెందుకు పాడు చూపులు పరులపైన 
పట్టుమని రెండు పదులు దాటని వయస్సు  
గట్టిగా జీవితాన పోరి గెలిచి నిలువని మనస్సు... 

ప్రజల్లో ఒకరైతే పట్టింపులేమి ఉండవు 
ప్రబలి నాయకుడైతే పది మంది చూతురు 
ప్రమోదమగు గుణ గణములను పాటించవలె 
పాటియగు పదికాలాలు ప్రజల గుండెల్లోన.... 

అమ్మా నాన్నల ఆలనా పాలనలు 
అమృత తుల్యమగు గురువుల బోధనలు 
అనితర సాధనమగు పొరుగు స్నేహాలు 
అమరును కొంత  అనితర సాధనాన .... 

చీడ పీడల బెడద చిక్కులు కొని తెచ్చు 
చీదరించి నిలిస్తే .... మనసు నిష్కలమశమౌ .... 
సాధనమ్మున మనము సమకూర్చుకోవచ్చు  
సద్గుణములు కొంత సాధించవచ్చు...... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం: USA)

No comments:

Post a Comment