Sunday, July 21, 2019

ప్రేమ కావ్యం

నగునూరి రాజన్న 
అంశం - ప్రేమ కావ్యం 
తేదీ 17-07-2019
శీర్షిక - కలి మాయ .... 
సంఖ్య - 238

ప్రేమంటే పరిమిత మాటల్లో తెలిపే మాంత్రికత కాదు 
మనసు ఎద లోతుల్లోంచి ఎగిసిపడే 
అనంత ప్రకంపనల ప్రవాహాల లావా 
ప్రపంచమంతా ఒకవైపు నిలిస్తే 
ప్రేమ తత్వం మాత్రం నిలిచేది మరో వైపు ... 

స్వార్థం మచ్చుకైనా కానరానిది
రోశం ఏ నిమిషాన దరి చేరనీయనిది  
ద్వేషానికి  ఏ మాత్రం తావీయనిది
కపట నాటకాలకు పట్టం కట్టనిది
త్యాగానికి మరోపేరుగా నిలుచునది....  

ప్రతి జీవి ప్రథమంగా ప్రస్తుతించాల్సింది
అహోరాత్రులు అపసోపాలు పడి
జీవితాంతం జీతం లేని ఊడిగం చేస్తూ
అనారోగ్యం చేస్తే  అన్న పానీయాలు మాని
ఆపదొస్తే ప్రాణం అడ్డు పెట్టి  నిలిచి పోరాడే ...... 
అనుభవిస్తే తప్ప అర్థం కాని అమూల్యమైన
అమ్మ ఆలి  ల  ప్రేమలే ...
ఆ తదుపరే అక్కా చెల్లి అన్నతమ్ముడు మిత్రులు ఏదైనా...... 
ఏ కావ్యం మాత్రం ఎంతని నిర్వచించగలదు ....

యాంత్రికతలో ...  కాలుష్యాల మహిమలో  ..... 
సాంకేతికతలో....  సమాచార విప్లవాలో  .... 
రంకు నేర్చిన రాజకీయాలో ..... 
మత్తు మందుల క్రీనీడలో....  
ప్రేమలు సైతం మలిన మాలిన్యాల మయమై 
కలి నీడల బీటలు కబళిస్తున్నాయి....... 

నగనూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :USA) 

No comments:

Post a Comment