అంశం : సర్కారు ఉద్యోగి
తేదీ : 01 -07 -2019
శీర్షిక : ప్రజాసేవకు పనిముట్టు
సంఖ్య : 224
ప్రజల నుండి ప్రజల చేత ప్రజల కొరకు
పరిపాలన ప్రాధామ్యమే ప్రభుత్వం .....
పవిత్రమైన ప్రజాసేవకు ప్రభుత్వ అంగాల పనిముట్టు ఉద్యోగి...
సగటు మనిషి చావు పుట్టుకల ధృవీకరణం నుండి
బతుకు జీవుల బత్తెముల చెల్లింపులు సైతం
గడియారపు బతుకులు నీతి నియమం కొందరికైతే....
గడియ రికాం లేని అవినీతి సంపాదన కొందరిది ....
పల్లె ప్రజా క్షేత్రం నుండి ప్రభుత్వ రాజధాని వరకు
ప్రజలనుండి రావాల్సిన పన్నులైనా .....
పట్నం నుండి పల్లె పల్లెకు ప్రతి మూలకు
సచివాలయం నుండి సర్పంచి దాకా
ప్రజలకు చేరవలసిన సంక్షేమాలైనా....
ప్రభుత్వాలకు ప్రజలకు ప్రత్యక్ష పవిత్ర వారధి...
ప్రజల ప్రత్యక్ష పరోక్ష పన్నుల ప్రతిఫలమే
ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలకు మూలం ....
లిఖిత రాజ్యాంగమే రక్షణ కవచం ....
అరువదేండ్ల వరకు ఆలన సురక్షితం...
మధ్యలో సాఫ్ట్ వెర్ తో కొంత మసకబారినా
మళ్ళీ తిరిగి పుంజుకున్నది భలే గిరాకీ .....
రాను రాను రాజు గారి గుర్రం గాడిదైనట్టు ....
చట్టం ధర్మం చుట్టాలుగ చేసుకుని ప్రజా సేవలను గాలికొదిలి,
జీతం పెరిగినా గీతం వదలమంటూ పని చెయ్యమంటూ
మొరాయిస్తూ లంచగొండి అవినీతి పెంచి పోషిస్తూ
బందు ప్రీతులకు రాజకీయులకు దళారీలకు ఆలవాలమై
క్రమశిక్షణ లేని కర్మచారులకు చిరునామాలై నిలుస్తున్నయి ...
ప్రజా కర్మను బాగు చేసే వీర భోగ వసంత రాయలు రావాలి .
No comments:
Post a Comment