Saturday, July 13, 2019

అభిలాష

అంశం - అభిలాష
తేదీ -05-07-2019
శీర్షిక - ఆచరణయోగ్యమైతే...... 
సంఖ్య - 228

జివ్హకో రుచి పుర్రెకో గుణం లాగా 
మనిషి మనిషికి మారే ఆలోచనలు  
మది మదికి మారే సంతృప్తులు  
చిన్ని చిన్ని కోరికలు చిలిపి ఆశలు 
కొంటె కోణంగులు.... అవునో... కాదో.... 
సంభావమో.... అసంభవమో.... అసలు 
ఉందో .... లేదో... అనే విషయాల పరిమితులే పట్టవు...  
పంచేంద్రియాల పదనిసలను పల్లవించడమే........ 

ఉద్భవించిన ప్రతీది ఉనికి చేరదు ..... 
కొన్ని కొన్ని పర్యాయాలు ఆశలకు  కోరికలకు 
అంగ బలం అర్థ బలం ఆత్మ బలం  
నిబద్దత  పట్టుదల దక్షత సమయస్ఫూర్థులు 
ధర్మాధర్మాలు న్యాయాన్యాయాలు  
సందర్భా సందర్భోచితాలను సైతం లెక్క చేయదు....

కాళోజీ గారన్నట్టు పుట్టుక చావు నీది 
బతుకంతా సంఘానిదే....    
నలుగురు మెచ్చేవైనా నాలుగు కాలాలు నిలిచేవైనా
చక్కనైన ఆకారం చెందాలన్నా   
నిక్కచ్చిగ రూపు దిద్దుకోవాలన్నా 
పిక్కటిల్లే ఉక్కు సంకల్పాలు ఊపిరి పోసుకోవాలి .... 
వలస వాదుల గుండెల్లో గుర్రాలను పరుగెత్తించిన ఛత్రపతి గానో ... 
సత్యం అహింసల సానుకూలవాది జాతిపిత గానో ....  
అంటరాని అనారోగ్యాల అపురూప దేవత మదర్ థెరిసాగానో....  
గంజాయి మొక్కల మధ్యన మెరిసిన కలాంగానో.... 
కాదేది అనర్హం.... కసిగా అలోచించి శుచిగా అమలు పరిస్తే
అభిలాషలన్నీ ఆచరణయోగ్యమైనవైతే...... 

No comments:

Post a Comment