అంశం : కార్తీక మాసం
తేదీ : 08-11-2018
శీర్షిక : యద్భావం తద్భవేత్
సంఖ్య : 91
పెద్దలు చెప్పిన సుద్దులైనా
విజ్ఞులు చెప్పిన శాస్త్రమైనా
యద్భావం తద్భవేత్ అన్నట్టు
ఆరోగ్యం, ఆధ్యాత్మికం,సద్భావం
సంక్షేమం సమ సమాజమన్నారు.
వర్షఋతువు ముగింపయి
శరదృతువు ఏతెంచ
వర్షాకాల తేమల్లో
సూక్ష్మ క్రిములు బాధించ....
అంతిమాన మిన్న ఆరోగ్యమంటూ
ఆచరించి చూపిరి ఆర్యులు మనకు
ఉసిరి వనమూలికలతో,
ఉరికేటి నీటి స్నానం ఉపశమనమని .
ఉసిరి వనమూలికల ఉల్లాస వాసనలు
శ్వాసించిన కలుగు సౌభాగ్యమంటూ
వనభోజనాల వంతులేర్పరిచి
ఘన సంబరాల గమ్మత్తు తెలిపిరి.
ఇచ్చి పుచ్చుకునే ధోరణికి
ఇల సాంప్రదాయాలు మిన్నంటు
ఉసిరి దీప దానాలకు
ఊతమిచ్చి చూపారు.
కార్తీకమంటేనే దామోదర ప్రియమని.....
కార్తీకమంటేనే యాత్రీకమని....
సకల జనులను ప్రస్తుతించి
సంఘ క్షేమానికి సంక్షిప్తపరిచి
సర్వ శ్రేష్ఠమని సన్నుతించిరి
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం.
మాసాలన్నింటికి మకుటమని
ప్రతి రోజు ప్రశస్తమేనని
పవిత్రతను పదిలపరిచి
కార్తీకాన్ని కదంబపరిచారు.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment