అంశం : ఉషాకిరణాలు
05 -11 -2018
శీర్షిక:ఉషాకిరణాలు
సంఖ్య: 88
కోడి కూతలతో.......
పక్షుల కిల కిలా రవములతో.....
ఊర పిచ్ఛుకల కిచకిచలతో.......
ఉదయభానుడికి ఆహ్వానమంప....
చిరు చీకటిని పారద్రోలే వెలుగు రేఖలు.
నులివెచ్చని స్పర్శలు పూయించే వింజామరలు.
కమ్మని అనుభవ పాఠాలు మిగిల్చే జ్ఞాన విరులు.
మానవ మేధకు దొరుకు విజ్ఞాన వీచికలు.
లేత ఎరుపు రంగు వర్ణాలతో
చిత్ర విచిత్ర రూప మేఘాల చిత్రమాలికలతో
జీవకోటికి నిత్య నూతన చైతన్యాలనందించ
సప్తాశ్వారథమారూఢుడై ఏతెంచె మానవాళిని కరుణించ....
ప్రకృతి అందాలు పంచు కమలములు వికసించాలన్నా..
ప్రాణవాయువులిచ్చే పత్రహరితము నిత్య సతతమై నిలవాలన్నా....
ప్రాణకోటికి హాని గొలిపే సూక్ష్మజీవుల భరతం పట్టాలన్నా.......
జీవరాశి నిత్య హోమపు ఆకలిదప్పులు తీర్చుకోవాలన్నా.....
సరికొత్త ఆలోచనలకు చక్కని నాంది పలికే
నిత్యనూతన చైతన్యాల ఊహలకు రెక్కలు తొడగాలన్నా...
నులివెచ్చని లేత భానుని కిరణాల తోడుంటేనే కదా...
నగునూరి రాజన్న

No comments:
Post a Comment