Wednesday, November 7, 2018

చీర -తేదీ 11-10-2018

అంశం: చీర 
తేదీ 11-10-2018
శీర్షిక :జాతి గౌరవం 
సంఖ్య : 76  

యుగ యుగాల మన సంస్కృతి 
జగాన వెలుగొందిన ఆకృతి 

పదాహారు మూరల  పసిడి ధార 
పండంటి ఇంతి కట్టు చీర 

పెళ్లితో మొదలెట్టు  చీరకట్టు 
పిల్లల లాలింపుకు  కనికట్టు. 

అతివ అందాలకు ఇనుమడింపు  
అలసిన మగవారికి  లాలింపు 

కష్టించే  వనితకు నీడపట్టు 
ఎండావానలకు గొడుగు పట్టు. 

కొంగు నింపుకున్న ఆడపడుచు 
కోటి వరాలనిచ్చు పుట్టింటికి . 

పదుల నుండి లక్షల మార్కెట్టు 
పడతులనాకర్షించు పలు రంగు రూపులు. 

స్త్రీ జాతికి వన్నె తెచ్చు చీరకట్టు 
భరత జాతి గౌరవం ఇనుమడించు  
విశ్వవీథి గగనాన....... 

నగునూరి రాజన్న 
కరీంనగర్ (HYD )

No comments:

Post a Comment