Wednesday, November 7, 2018

శతమానం భవతి తేదీ 10-10-2018

అంశం : శతమానం భవతి
తేదీ 10-10-2018
శీర్షిక : హిమనగం 
సంఖ్య : 75

తాగి తందనాలాడి తప్పులు చేసి 
మునిమాపు లేసి వల్లె వేసుకుంటే..... 
చేసిన తప్పులు చెల్లవుతాయా  ..... 
వల్లె వేసుకుంటే మాఫీ అవుతాయా......... 

అడ్డదిడ్డ మైన పనులకు 
ఆలవాలమైతే అవుతుందా జీవితం .... 
బలవంతపు దీవెనలతో 
బతుకు తెల్లవారుతుందా..... 

తప్పు దారులెన్ని నడిచినా 
ఒప్పులు కుదురుగ చేయకపోయినా.... 
తప్పకుండ కోరుకునేది 
ప్రతి ఒక్కరూ అదే కదా..... 

హిందూ సాంప్రదాయాన 
హిమనగమై నిలిచినది 
పెద్దల ఆశీర్వాదాలే అందరు కోరేది 
శతమానం భవతి ..... 

అంతశుద్ధి ఆనంద ప్రతీకగా 
వాక్శుద్ధి కలిగిన వామనుడైనా   
"శతమానం భవతి" అని దీవిస్తే
వేయేనుగుల బలమే కదా.....  

శత వసంతాలు దర్శించుమని భాషిస్తే 
తధాస్తు దేవతలు తోడైతే,
చేసేవి మంచి పనులైతే  
చెప్పకనే  నెరవేరు దీవెన ఫలితం.  
నగునూరి రాజన్న 



No comments:

Post a Comment