టి కవితాంశం : ధిక్కారం
09-11-2018
శీర్షిక : బహు పరాక్ .... నయాకా...
సంఖ్య : 92
ఆటవికతను అధిగమించిన అనాగరికుడు
అడుగడుగున ఆదిపత్యానికై అడుగిడు.
ప్రాణకోటి మీద సాధించిన వాంఛతో
సాటి మనిషిని సైతం వంచించు పదే పదే ..... .
చిన్న సంస్థానాలైనందున భారతం
చిక్కింది పరుల పంచన ఆనాడు.
వందలేండ్లు మనల్ని వంగదోలిన
తెల్లోడి తిరస్కారాలకు ధీటుగా
ధిక్కరించి ఎదురించె ఒక్కరొక్కరు
ఒడిసిపట్టి సాధించిరి స్వాతంత్య్రం.
స్వాతంత్రియానంతరం సైతం
ఒక్కటవ్వనని ధిక్కరించిన
565 సంస్థానాలను అప్రతిహాతంగా
ఒక్కటిగా నిలిపె ఉక్కుమనిషి.
పోటీ లేదు మాకంటూ
తోటి వారని మరచిన
వలస నాయకుల వల్ల
చీలి పోయెను రాష్ట్రం.
సమిష్టి ధర్మం, సర్వులకు న్యాయం
సమసిపోయే ప్రతీ క్షణం.....
సంభవించు నాందీ ప్రస్థానం
ధిక్కారపు అంకురానికి .......
బహు పరాక్ ....... నాయాకా.....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment