అంశం : పూల పండుగ
తేదీ 09-10-2018
శీర్షిక : సప్త వర్ణ శోభితం
సంఖ్య: 74
శరన్నవరాత్రులంటేనే
శక్తిపూజకు పేరు
అమ్మవారిని కొలుతురు
అనువైన తీరు
బ్రతుకునిమ్మని కోరేదే
బతుకమ్మ పండుగ
తెలంగాణ పూల పండుగై
శోభిల్లె నిండుగా
బంగారు తంగేడు
బహు చక్కని బంతులు
మురిపాల చామంతులు
ఇంపైన గునుగులు
ఇల మెరయు పట్టుకుచ్చులు
చిత్రంగ గుమ్మడి,
చిరు ఉద్రాక్షలు ,
చిట్టి గోరంటలు
పచ్చన్ని బీరలు
పావురమైన కట్లలు,
రంగు రంగుల పూలన్నీ
రమణీయంగ పేర్చి
ఘనమైన గౌరమ్మను
అందునా జేర్చి
పట్టువస్త్రాలు కట్టి
పడతులంతా జేరి
ఆడిపాడేరు అల్లారు ముద్దుగా
గౌరమ్మ పాటలు తనివిదీర.
పరమాత్మను సేవించే
పలురంగు పూలనే
పవిత్రంగా పూజించి
పరవశించేరు.
తొమ్మిదో రోజున
సద్దుల బతుకమ్మగా కొలిచి
సాగనంపేరు
సల్లంగ చూడమని
మరి మరి వేడుకుని
సక్కనైన ఆట పాటల
సత్తు వాయనాలందుకుని.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment