అంశం: మాట తీరు
12-10-2018
శీర్షిక : ఆత్మసాక్షి
సంఖ్య :77
తనయుడు కానల బాట పట్టె
తండ్రి మాటకు కట్టుబడి .........
తప్పలేదు భూజాతకు కష్టం
తిప్పని మాట పలితం...........
మాటకెంత విలువో
మనిషై నిరూపించెఁ మాధవుడు.
యుగాలెన్ని మారినా
జగాన చుక్కానై నిలిచె.
కపట బుద్ది సుయోధనునకు
కర్ణుడు కట్టుబడి నిలిచి
ఆడి తప్పని అంగరాజై
కడతేర్చుకున్నాడు తనకు తాను...
మాటకు విలువిచ్చే మనిషిగా
ఆలు బిడ్డలను అమ్ముకునె...... .
సత్యవాక్య పాలనకై
సచ్ఛీల హరిశ్చంద్రుడు .....
ఆసేతు హిమాచలాన్ని
ఒక్క మాటపై నిలిపె ....
కరంచంద్ గాంధీజీ
అహింసే ఊపిరిగా ...
కాన రారు ఈనాడు
నికార్సైన నాయకులు
ప్రజాసేవ పేరు చెప్పి
పైకం కొల్లగొట్టే వారే తప్ప....
ఆత్మసాక్షి కన్నా
ఆనవాలు అవసరం లేదు
మాటే కదా అని మారిస్తే
మరణించినా వెంటాడు.....
నగునూరి రాజన్న
కరీంనగర్ (HYD)
No comments:
Post a Comment