నగునూరి రాజన్న
అంశం : పులకరింత
17 -10 -2018
సంఖ్య: 79
శీర్షిక: పరవశించు వేళ
అమ్మ మనసు చల్లన
నాన్న మనసు మెత్తన
పిల్లలేమో దేవుని ప్రతి రూపాలు
వారి తొలి పలుకులే పులకరించు కదా
అమ్మానాన్నల ఆనందాల మదిన.....
శిష్య పరమాణువులు
శిరములూపి వినమ్రంగా
గురు భోధనలాలకించి
ప్రప్రథములుగా నిలిచిన
శుభ ఘడియలయందు
పులకించు కదా గురువు మది........
అంకితమైన భక్తునికి
అనంతుని మహిమ సోకి
అద్భుతమై తోచినవేళ
ఆవరించదా పులకింత....
ప్రతి మనిషి జీవితాన
అనుభవించి ఆనందించేదే
నిరీక్షించి చేరుకునే
నిర్వచించలేని ఆ క్షణం
మధురానుభూతుల మరుపురాని
క్షణం మనసు పులకరింతలు.......
నగునూరి రాజన్న
అంశం : పులకరింత
17 -10 -2018
సంఖ్య: 79
శీర్షిక: పరవశించు వేళ
అమ్మ మనసు చల్లన
నాన్న మనసు మెత్తన
పిల్లలేమో దేవుని ప్రతి రూపాలు
వారి తొలి పలుకులే పులకరించు కదా
అమ్మానాన్నల ఆనందాల మదిన.....
శిష్య పరమాణువులు
శిరములూపి వినమ్రంగా
గురు భోధనలాలకించి
ప్రప్రథములుగా నిలిచిన
శుభ ఘడియలయందు
పులకించు కదా గురువు మది........
అంకితమైన భక్తునికి
అనంతుని మహిమ సోకి
అద్భుతమై తోచినవేళ
ఆవరించదా పులకింత....
ప్రతి మనిషి జీవితాన
అనుభవించి ఆనందించేదే
నిరీక్షించి చేరుకునే
నిర్వచించలేని ఆ క్షణం
మధురానుభూతుల మరుపురాని
క్షణం మనసు పులకరింతలు.......
నగునూరి రాజన్న
No comments:
Post a Comment