అంశం : చీకటి వెలుగుల రంగేళి
తేదీ : 07-11-2018
శీర్షిక : హక్కు భుక్తములు ఆడవారికి....
సంఖ్య : 90
మంచి చెడుల మతలబులు
కలిమి లేముల కష్టసుఖాలు
చీకటి వెలుగుల అడుగుజాడలు
ద్వాపారమైనా .... కలియుగమే....... .
నరకుని వధ గావించ
నారాయణుడే పయనమయ్యే..
అనుసరించి సత్యభామ
అగ్రపూజలందుకునే !
రాక్షసాంతమయ్యెనని
రంజిల్లిరి జనులంతా ....
రంగు రంగుల ముగ్గులేసి
రంగవల్లులే తీర్చిరి రమణులంతా....
ఆనందాన జనులంతా
అంబరమంటే సంబరాలతో .
ధీటైనా కాంతులకై
దీపాల వరుసలుంచిరి .
అపురూప పర్వమై
ఆనవాయితీగ నిలిచె.
ఆడదంటే ఆబల కాదని
ఆనాడే ఋజువు పరిచినా......
ఈనాటికి జాడ లేవు
హక్కు భుక్తములు ఆడవారికి......
కళ్ళు మూస్తే కారు చీకట్లు
కళ్ళు తెరిస్తే పున్నమి వెలుగులు
చీకటి వెలుగుల సమ్మిళితమే
మానవ జీవితాన హరివిల్లు .......
నగునూరి రాజన్న
No comments:
Post a Comment