Wednesday, November 7, 2018

వెలుగు నీడలు 18-10-2018

అంశం : వెలుగు నీడలు
18 -10 -2018
సంఖ్య: 80
శీర్షిక : సమస్థితులు


అమ్మ గర్భాన చిరు చీకట్లోనే
జీవం పోసుకునేది ............
వెలుగు రేఖల్లోనే జీవన
గమనం సాగుతున్నది........

భూమి పొరల్లో చీకటి మాటున
నిక్షిప్తమైతేనే.................
అంకురమై నిలిచేది
అవనికి వెలుగుల స్వచ్ఛత
చేకూరేది ............

చీకటిలో కూరుకున్న తల్లి వేరే
వెలుగుల తరువుకు పట్టుగొమ్మలైనట్టు.....
ప్రతి మనిషికి వెలుగు నీడలు
తోడు నీడై అడుగడుగున ఆలంబనలే సుమా ......

వెలుగు వెంట నడిచే చీకటి
చీకటి తోడుగ నిలిచే వెలుగు
కలిమి లేములు కావడి కుండల్లాగా
సమస్థితికి తులాభారాలు .........

ప్రతి మనిషికి పరీక్షే మరి....
వెలుగులో పరుగెత్తాలి
చీకటిలో సేద తీరాలి
ఉచ్వాస నిచ్వ్వాసా లాగ రెండూ
సమస్థితులే నని స్థితప్రజ్ఞత సాధించాలి...


నగునూరి రాజన్న

No comments:

Post a Comment