అంశం : ఆలాపన
13-10-2018
నగునూరి రాజన్న
శీర్షిక : సత్యం
సంఖ్య : 78
అష్టకష్టాలు పడినా
అష్టైశ్వర్యాలు పొందినా
అమ్మ ఆలాపనంతా
పిల్లల అభివృద్దే .......
ఆరుగాలం కష్టపడినా
అతివృష్టి అనావృష్టిలున్నా
అరకదున్నే రైతన్నకు
ఆలాపనంతా మెతుకు పంటే....
వాతావరణాలెలా ఉన్నా
ఆరోగ్యాల మాటెలా ఉన్నా
వ్యక్తిగత జీవితాలెలా ఉన్నా
సైనికుని ఆలాపనంతా దేశ భద్రతే......
అమ్మ నేర్పిన అక్షరజ్ఞానం
నాన్న చూపిన మార్గదర్శకం
గురువు బోధించిన భాషాభిమానం
వెరసి నా ఆలాపన అంతా చిన్న కవితకై ........
కానీ
ఎందుకో పాలకులకు లేకపాయె
అధికారులకు అలవడకపాయె
మంచి పారదర్శకమైన పాలనకై
ప్రజా క్షేమం కాంక్షించే ఆలాపన....
కరీంనగర్ (HYD)
No comments:
Post a Comment