Wednesday, November 7, 2018

కరచాలనం 20-10-2018

అంశం : కరచాలనం 
20-10-2018
సంఖ్య : 80
శీర్షిక :  వారధి 

ఆచార సాంప్రదాయాల్లో అగ్రగాములం
తల్లితండ్రులకు,గురువులకు,అతిథులకు 
ఆత్మీయంగా ఆత్మను పలుకరించేదే
రెండు చేతులా నమస్కారం మన ఆచారం ..... 

పాశ్చాత్త్య పోకడగా ఫరిఢవిల్లుతున్న  
కరచాలనం కాదేమి మనకూ  వింత... 
బ్రతుకు పయన ప్రారంభంలో 
వివాహ వేడుకల్లో పాణి గ్రాహణం...  

గుండె గదిలో గూడు కట్టిన 
ఆత్మీయతలు అలుగులైతే  
తనువు నిమిత్తం లేకుండా 
తన్నుకొచ్చే ప్రేమకు సూచీ ..... 

కరచాలనములు  కూడిన 
కల్మషములు వీడును   
విద్వేషాల విచ్చుకత్తులు 
గాలి మబ్బులై విడిపోవును....  

ఇరు మనుషుల మధ్య 
మమతల భావ వ్యక్తీకరణకు.....  
దేశాల మధ్యన  వాణిజ్య
ఒప్పందాలలొ నిర్ధారణ సంకేతంగా... 

వివిధ దేశాల రక్షణ  ఒప్పందాలలొ
సంధి సూచిక సంకేతంగా .... 
భిన్న సందర్భాలలో  ....... 
భిన్న సంకేతాల సమాహారమే .......... 
నేటి మన కరచాలనం.......

ఏది ఏమైనా  ............. 
ఐక్యత,అనురాగ, ఆత్మీయ 
అనురక్తుల ప్రదర్శనకు 
అనుసంధాన వారధి. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment