దర్పణం సాహిత్య వేదిక
అంశం - బహుమతి 1229
తేది: 01-08-2024
శీర్షిక : ఉత్సవాహాలు నింపే టానిక్కు
ఆటల్లో పని పాటల్లో
అద్వితీయానికి గుర్తింపు ...
పిల్లలకైనా పెద్దలకైనా
ప్రోత్సాహకాల పెన్నిధి ....
పట్టుదల దీక్షలకు
పెట్టుబడి అవుతుంది....
ఇష్టంగా పడిన కష్టానికి
తగిన గుర్తింపు నిస్తుంది ...
పొందడమే సుందరం
అందమైన అనుభవం ....
బహుసున్నితమైన బంధం
బంగారు వెండి పథకాలుగా ...
నలుగురిలో గుర్తింపు
నజరానాగా నిలిచేవి ....
మంచిని కంచెవేసి నిలుపుతూ
అలరారే ఆశల జ్యోతి....
ధర్మానికి కొమ్ము కాస్తూ
న్యాయానికి అండగా నిలబడి
చట్టానికి సమవర్తిగా చేసుకుని
అభివృద్ధికి బాటలు వేసేది .....
ఆత్మీయ సత్కారం
అభిమానాల కమ్మదనం ...
అపురూప మానసం
ఆదరించి అందించేది ....
ఉత్సవాహాలు నింపే టానిక్కు
ఉల్లాసాలను ఒంపే మ్యాజిక్కు ...
బంధించే సుమ పరిమళం
అంధిరోహించే హిమ శిఖరం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment