ప్రణయ నగరిలో ప్రపంచ క్రీడలు
తేది 31-07-2024
శీర్షిక : మహా క్రీడలు
అందమైన ఐదు వలయాలు
సుందరమగు చిహ్నముగా
సుపరిచితమే ప్రపంచమంతా
ప్రఖ్యాతమై మహాక్రీడలుగా .....
చతుర్వత్సరములకొకసారి
చెణుకులీను వివిధ దేశాలలో ...
గురితప్పక గురుతరమై
గుంభనముగా నిర్వర్తించుచుండె .. ..
ఏథెన్స్ లో మొదలైనా
ప్రపంచమంతా పయనిస్తుండే ...
పక్కాగా లెక్కలతో సరిపోలుతూ
ముప్పదిమూడవడిగా పారిస్ లో ....
ఇరువదెనిమిది ఆటలలో
వేలమంది పాల్గొనగా
స్వర్ణ రజిత కాంస్యములతో
సత్కరించి సాగనంపెదరు ....
సద్భావనలకు సంకేతముగా
మిత్రుత్వము కొనసాగాలనే
మనిషి ఆశకు ప్రతిరూపమే
ఆశయాల గమనమే ఒలంపిక్స్ .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment