గడ్డి
30-09-2024
శీర్షిక : పచ్చదనం
తొలకరితో పరిమళించే
పచ్చదనం ... రకలెన్నైనా
రంజింపజేయు మనమున
గ్రీష్మ జ్వాలల విముక్తితో ....
చులకనగా చూడకు
అల్లుకున్న బంధమే
ఇంటిచుట్టూ... పశువుల
పాలకు పరోక్షమే ఆహరం ....
కోట్ల కుంభ కోణాలకు
కొదువలేదు మన నాయకుల్లో ...
అందులో ఇదీ ఒకటే
హేయమైన గుణదోషాలకు ....
పరపరాగ సంపర్కమెరుగని
ప్రశస్తమైన గరక పరకలు
గణేశుని పూజకు ఘనమైన
పూజా సామగ్రి పుష్కలమై ....
యజ్ఞ యాగాదులలో అర్పించే
అష్టార్ఘ్యములలో ఒకటి దర్భ ....
గరికపూలెన్నో గరిమలే
శివపూజ చింతనలో వింతగా ....
నాగరికతలో నడక నేర్పింది
గడ్డి గుడిసెలతో నివాసమయి ...
అల్పం చేయకు అలసత్వంతో
ఏదైనా ఘనమే జీవితాన ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment