బోనాల గేయాలు
తేది : 27-07-2024
శీర్షిక : అమ్మపూజ వేళాయె
ఆషాఢం వచ్చింది
అమ్మ పూజ బోనాలు....
ఆదిశక్తి రూపాలను
ఆదరించి కొలవంగ ....
భాషలు ప్రాంతాలుగా
బహువిధముల పూజలు ...
తెలంగాణ తల్లులకు
బోనముతో మొక్కెదరు...
గోల్కొండ బల్కంపేట
ఉజ్జయిని మహంకాళి ...
నవవిధముల నివేదనం
భక్తితత్వ ప్రదర్శనం .....
ఆషాఢం వచ్చింది
అమ్మ పూజ బోనాలు....
తొలకరితో పలకరించు
తొంబై ఒక్క రోగాలు....
తొణకకుండ నివారించే
తోడుతనే పూర్వీకులు
కొత్తనీటి కలుషితాలు
కోర్ణాలతో బెంగలే....
మడి ఆచారములతో
మమేకమే ఆధ్యాత్మికత....
ఆషాఢం వచ్చింది
అమ్మ పూజ బోనాలు....
పసుపు పారాణీలతో
పడతులంతా పూసుకుని ....
కొత్తకుండ పూదించి
బొట్లుపెట్టి వండుదురు ....
వేపాకులు కట్టుకుని
దీపాలను పెట్టుకుని
శివసత్తులు ఆడుకుంటూ
గుడివరకు వచ్చెదరు ....
ఆషాఢం వచ్చింది
అమ్మ పూజ బోనాలు....
నెత్తిమీద మోసుకొచ్చి
ఆర్థిదీర కొలిచెదరు ....
పోతరాజు బలులతో
అమ్మలకు అర్పింతురు ....
ఎల్లమ్మకు మైసమ్మకు
ఎదురుపడి మొక్కెదరు ....
గుగ్గిలము పొగలేసి
గుండె నిండ కొలిచెదరు
ఆషాఢం వచ్చింది
అమ్మ పూజ బోనాలు....
ఆదిశక్తి రూపాలను
ఆదరించి కొలవంగ ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment