చిత్ర కవిత (శిథిలమైన పాత ఇల్లు )
తేది : 29-07-2024
శీర్షిక : శిథిల జ్ఞాపకాలు
అసలు చిరునామాకు సంకేతం
ఆనాటి చిన్ననాటి తీపి జ్ఞాపకం
తరాలకు తరాలను ఒడిలో పెంచిన
ప్రేమ మమకారం అనురాగం .....
పైకి కూలిన పెంకుటిళ్లయినా
కలల వాకిలి కలవారి లోగిలి ...
పచ్చని పొలాల మధ్యన
పరిఢవిల్లిన ఒకనాటి ప్రేమ సౌధం ....
అంకురమై మొలకెత్తినది
ఆత్మీయతల రుచులు పొందినది ....
అన్నదమ్ములతో ఆడుకున్నది
తోబుట్టువుల తోరపు బంధం ....
నానమ్మ తాతల రెక్కల కష్టం ...
అమ్మా నాన్నల అపురూప బంధం ...
కమ్మని కలలకు ఆలవాలమై
తల ఎత్తుకు నిలిపిన కిరీటి .....
తెలిసీ తెలియని వయసునుండే
తెలుసుకున్న అపురూప జ్ఞానాలకు
మూలమది ... వందల బంధువులను
పరామర్శించిన పరిపక్వతల గని ....
నాన్నల తరానికి మా తరానికి
పచ్చ తోరణమై ఇంటివాళ్లుగా
నిలబెట్టి నీడనిచ్చిన వటవృక్షం ...
తలుచుకుంటే నిలువెల్లా పులకరింపులే ....
కాలానుగుణమై
కొత్త కొత్త భవంతులలో
తనువును బంధించుకున్నా...కలలలో
జ్ఞాపకాలుగా వీడని బంధువే .... వీలైతే
మళ్ళీ ఊపిరి పోసుకుని పూర్వ వైభవంతో
వెలుగొందాలని ఆశల ఊపిరితో ఆశగా
మిణుగురై ఎదురు చూస్తున్న బాటసారి ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment