ఈ నల్లని రాళ్ళలో
తేది : 25-07-2024
శీర్షిక : మన సినారె
సహస్రాధికం
పరిచయమక్కరలేని పండితశ్రేష్ఠుడు
హన్మాజీపేటలో పుట్టిన రైతుబిడ్డ
హైద్రాబాదులో పెరిగి పెద్దయి
ముద్దొచ్చిన మూర్తిమంతుడు ....
నవ్వని పువ్వైనా సరే....పసిడి సాహిత్య
పంటలు పండించిన సాహితీవేత్త ...
లెక్కలేనన్ని కథలు కావ్యాలు
కవితా సంపుటులు నాటికలు
పద్య గద్య పదనిసలు .....
గజళ్ళతో గమ్మత్తులు .....
విశ్వంభరతో వినీలాకాశం .....
వేల సినిమా పాటలు రచించి....
వెలలేని కీర్తి కిరీటాలు పొంది
వేనోళ్ళ కీర్తింపబడిన
వెలుగుపూల సూర్యుడతడు ....
వెతికి పట్టుకున్నా దొరకని
కలికితురాయి లాంటి సినీ
గీత రచయితగా పేరు పొందిన
గొప్ప ప్రఖ్యాత రచయిత ...
లెక్కలేనన్ని పురస్కారాలు
లెక్కకు మించిన సత్కారాలు
పక్కాగా అందించిన కేంద్ర సాహిత్య
అవార్డు జ్ఞానపీఠ్ అవార్డులు .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment