బడ్జెట్
తేది : 24-07-24
శీర్షిక : డిస్కౌంట్ ... సబ్సిడీ ...
అంచనాలతో నిచ్చెనలేస్తూ
అట్టడుగు వర్గాలకు ఆసరా
అవుతూ సంఘంలో సమతుల్యతలకు
సతతం సర్దుబాటు చేసే చిట్టా ...
అధికార పక్షం అవునంటే
ప్రతిపక్షం కాదుపొమ్మంటూ
వింత తర్కాలతో కొంత రచ్చ
చేసే సంత ముచ్చట్ల మల్లగుల్లాలు ....
ఆశల ఊపిరితో బతికే
ఉద్యోగులకు పిప్పరమెంట్లు ...
అత్యాశల పెట్టుబడిదారులకు
ఆపన్నముగా వేసే అడ్డుచక్రం ...
అభివృద్ధికి ఎంతో కొంత
ఊతమియ్యాలనే సదుద్దేశం ...
అయినా కుర్చీలు పడిపోకుండా
ఓటుబ్యాంకు రాజకీయాలు ....
పైవారికి పట్టుపరుపులలాంటి
డిస్కౌంట్లు కిందివారికి సంక్షేమ
ఫలాలంటూ సబ్సిడీలు ... ఎటొచ్చి
మధ్యోని రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ
సమసమాజమంటూ పోలికేకలతో
కోతుల తగాదా పిల్లి తీర్చడంలా ....
No comments:
Post a Comment