నీ తోడుగా...నీ నీడగా...
తేది : 01-08-2024
శీర్షిక : మారిన జీవితరంగం
మురిపాలన్నీ మూటగట్టిన
మూడుముళ్ల బంధాలలో
నీ తోడుగా.... నీ నీడగా ...
జీవితాంతం ఉంటానని ....
మాట ఇచ్చి నిలిచినదే
మనువు మంత్రాలలో...
పెద్దలు కూర్చిన పెళ్లిళ్లలో
సంస్కృతీ సంప్రదాయంగా ....
దారులు వేరయినా దరికి
చేరి నిలిచినదే ... ఒకరికొకరం
తోడు నిలుద్దామని కనుపాపల
రెప్పలమవుదామని బాసలే....
మనసా వాచా కర్మణా
ఒక్కసారి ఒకటయ్యామా ...
మరణం వరకు తోడూ నీడని
క్రమశిక్షణల సంఘ అభివృద్ధికి
మార్గమై .....
కలిమాయలు కబాడీ ఆడుతుంటే
అంతా తూచ్ .. అంటూ
ఎవరిష్టానికి వారయి బంధాలు
బాధ్యతెరుగని వాణిజ్యమయ్యాయి ....
పేరుకే ప్రజాసంఘాలు ప్రతినిధులు
ప్రభుత్వాలు...పాత్రలు పోషించలేక....
ప్రేక్షకపాత్రలే ...చేతులు ముడుచుకున్న
చోద్యములు.... వింత రీతుల తంతులు ....
కారణమేదయినా ... కాలమే
సమాధానపరచాలి... క్రమశిక్షణల
అభివృద్ధికి .. కట్టుబాట్ల సంఘమై
కమనీయతలు మూటగట్టడానికి ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment