ఈ వేళలో...ఈ పూలలో ...
తేది : 31-07-2024
శీర్షిక : ఎద మురిపించే పల్లవులే ....
ఈ వేళలో...ఈ పూలలో ...
ఎన్నెన్ని రంగులో
ఎన్నెన్ని హంగులో ....
ఎద మురిపించే పల్లవులే ....
పరిమళాలు వెదజల్లినా
పదనిసలై పలికించినా
కవనములై ముదము గొల్పినా
మనసుకు హత్తుకునే చరణములే ....
పుప్పొడులై వెదజల్లినా
గుప్పెడుగా ఒదిగిపోయినా
ఒప్పుల కుప్పల గానములై
మనమున మెచ్చుకునే భావనలే ...
ఏవేళయినా ... ఏ పూలైనా
నిలిచేది ఒక రోజయినా
కొలిచేది దైవ సన్నిధి కావాలని
మనసారా కోరుకునే అభిలాషే ...
వాలిపోయే కాలమొస్తే
రాలిపోయే సమయమొస్తే
కవనములో సవినయమై
కలకాలం నిలవాలనే ఆశయమే ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment