కొనగోటి మీద జీవితం
తేది- 27-02-2020
శీర్షిక - క్షణ భంగురం... ఈ జీవితం
సంఖ్య - 359
జీవితం క్షణ భంగురమని తెలిసినా
ఆశ చావని అర్భకులు రాజకీయనాయకులు
తర తరాలకు సరిపడా సంపాదనలు
అధికార మత్తు అవధులు దాటితే ......
ప్రాణాలు ఫణంగా పెట్టి తెచ్చుకున్న స్వాతంత్య్రం
పదిలంగా కాపాడుకోవాల్సిన ప్రజాతంత్రం
ఆర్భాటాలకు అర్రులు చాచే అధికార పక్షం
ప్రేక్షక పాత్రల పెద్దన్న చిత్రం మన ప్రతిపక్ష గణం
పాలకుల పరాచికాల పటాటోపానికి అపహాస్యం...
సిద్ధాంతాలు లేని బుద్ధావతారాలతో
ఎద్దేవా అవుతుందేమో దేశ పురోగతి
మత ప్రతిపాదికల మల్లగుల్లాలు
దీర్ఘకాల ప్రాయోజితాలు విస్మరింపు
స్వల్పకాలిక సర్దుబాట్లతోనే సాగతీత .....
అక్కరకు రాని వెక్కిరింతల హామీలు
సంబంధం లేని సాధ్యాసాధ్యాలు
స్వావలంబనలు గాలికొదిలిన సంక్షేమాలు
సోమరుల ఉత్పత్తి కేంద్రాలయిన
పనికి(మాలిన) ఆహార పథకాలు
పన్ను చెల్లింపుదారుల పగిడి మోతలు
పందికొక్కులకు ఫలహారాల సబ్సిడీ లు
వ్యక్తి పూజలతో వ్యవస్థలు కుదేలు
చేతివాటపు అపసవ్య పన్ను వసూళ్ళతో
చిల్లు పడ్డ నావలు ప్రభుత్వ ఖజానాలు.....
జవసత్వాల జలగలు ప్రభుత్వ ఉద్యోగులు
లంచాలకు మంచమేస్తున్న ప్రజా భక్షకులు....
విశ్వమెరిగిన విధి విధానమే అయినా
అధికులు అవగాహన చేసుకున్నా
అల్పులు మాత్రం అక్కడే తచ్చాడుతూ
చిరునామాల చిత్తు కాగితాలౌతున్నారు....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment