వారసత్వం
తేదీ- 18 - 02 -2020
శీర్షిక - వారసత్వాలు.... మానవాళి
సంఖ్య - 356
వేద పురాణ ఉపనిషత్తుల సమాగమం
జగతికి మార్గనిర్దేశమైన జాతి విలువల ఔన్నత్యం....
ప్రకృతి ప్రసాదించిన పంచభూతాలు
తరం నుండి తరానికి నిలిచే సాక్షీ సంతకాలు....
తాతల తండ్రుల తనువులు పంచుకుని
కొడుకులు మనుమల జన్మల కోనసాగింపే....
మంచి చెడులను మాటవరసకు పాటిస్తూ
మదిన నిలుపుకుని మసలు తత్వమే....
సంస్కృతి సాంప్రదాయాల సచ్చరితలు
అలవాట్లు పొరపాట్ల ఆచరణాత్మకాలు....
సంగీత సాహిత్య కళల కదంబ కాణాచీలు
విద్య ఉద్యోగ నైపుణ్య పాలనల విశదీకరణలు....
శుచి శుభ్రతలను సూటిగా పొదువుకునేది
ఆచార వ్యవహారాలను అక్కున చేర్చుకునేది
కట్టుబొట్టు కట్టుబాట్లను కణికట్టుగా నిలుపుకునేది
తిండి తిప్పళ్లను దివారాత్రాలు పాటించేది.......
స్వార్థాల తట్ట బుట్టలను తలకెత్తుకుని
సాంకేతికతను సంకన బెట్టుకుని
అలసత్వాలను అక్కున జేర్చుకుని
వరుసలు వారసత్వాలు అన్నీ మరస్తున్న మానవాళి......
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment