మార్పును ఆహ్వానిద్దాం
తేది: 30-11-2021
శీర్షిక : మనసుపెట్టి ఆహ్వానిద్దాం
కవిత సంఖ్య : 807...
శిశిరంలో ఆకులు రాల్చుకుని
వసంతంలో చిగురించిన తరువోలె
పాతనీరు పోయి కొత్త నీరొచ్చినట్టు
మార్పన్నది అత్యంత సహజము….
రాతి గుహల్లో ఒళ్ళు విరుచుకుని
చక్రం పనిముట్లతో చట్టాపట్టాలేసుకుని
పారిశ్రామికతలో పరుగులు లంఘించి
సాంకేతికత సౌరభాలు సుగంధాలు అద్దుకుంటున్నాం ....
అమ్మ చందమామను చూపించి
గోరుముద్దలు తినిపించినా ....
చుక్కల పందిరిలో కాలం లెక్కించినా ...
గ్రహాంతరాలకు రాకెట్లను కనుగొన్నాం .....
కర్రు నాగలి ...దాపల వలపల కాడెద్దులు....
బారులు తీరిన బండ్లు మాయమై
శారీరక శ్రమలను మింగేసిన యాంత్రిక
పనిముట్లేన్నో ... వ్యవసాయంలో
సాయమందిస్తున్నవి రైతన్నకు ...
మార్పులోనే పుట్టి ... మార్పులోనే పెరిగి ...
మార్పులోనే పయనిస్తున్నాం .....
మంచి చేసే మార్పు ఏదయినా సరే
మనసుపెట్టి మనమంతా ఆహ్వానిద్దాము .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment