విరహ గీతాలు
తేది: 27-11-2021
శీర్షిక : ప్రియా ....
కవిత సంఖ్య : 804
ప్రియా ! ఓ నా ప్రియా !
ఓపలేను మన ఎడబాటు
సెలవీయవే ఇకనైనా ....
ఆపలేను ఈ తడబాటు ..... ప్రియా
ఎన్నేళ్ళని ఎదురుచూడను
వయసు ముంచుకొస్తున్నది
ఎన్నాళ్లని ఈ పడిగాపులు
మనసు లాగేస్తున్నది ...... ప్రియా
మాఘమాసం రానున్నది
మంచిమూర్తం తోడున్నది
కొంచెమంతా పెద్దమనసుతో
పెద్దలందరిని కలపవోయి... ప్రియా
మాట మాటా చేరవేయి
మనసు మాట తెలియజేయి
మనువు కుదిరే మార్గమేదో
మరుగు లేక తెలుపవోయి ....ప్రియా
మనసులోని ప్రేమంతా
మల్లెపూల తోటలాగా
మలయమారుతమై వీచగానే
మనసుకేదో హాయి హాయి ......ప్రియా
ఇల్లందకుంట జాతరకు
ఇద్దరము కల్సెల్లుదాం
రాములోరికి మొక్కుకుందాం
రత్నమంటి పిల్లలకోసం .... ప్రియా ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment