గేయం
శీర్షిక : ఏందయ్యా బ్రహ్మయ్యా
తేదీ : 28-11-2021
కవిత సంఖ్య : 69+15
ఏందయ్యా బ్రహ్మయ్యా
ఏంటో ఈ గమ్మత్తూ
కలి మాయలంటుంటే
కలో….గంజో….అనుకున్నా
కలిగినదేదో కలిసి
పంచుకోవడమేనుకున్నా
// ఏందయ్యా//
ధర్మం పక్కకు జరగంగానే
మర్మము తప్పిన జీవాలు
వివరం చెప్పి తెలిపినా
ఖర్మం తప్పని నడకలేనాయే ...
// ఏందయ్యా//
మంచికి కంచెగ నిలిచే
గెలుపు గుర్రమే ధర్మం కాదా
మదాంధుల వంచనలకు
తల వంచి నిలవడమేనా ….
// ఏందయ్యా//
అన్నెం పున్నెం ఎరగని
అభాగ్యులకేమో అధోగతులు
అన్యాయాలు వెలగబెట్టే
అధములకేమో రాజలాంచనాలా ….
// ఏందయ్యా//
ఒంటి కాలిపై నిలిచిన నీవు…
కంటి పాపలై వెలిగే
రేపటి తరం వీరులను
చల్లగ కాపాడుమయా.
// ఏందయ్యా//
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment