Friday, February 11, 2022

నేనూ నా మనసు తేది : 27-11-2021 శీర్షిక : నిజ చెలికాడు

నేనూ నా మనసు 
తేది : 27-11-2021
శీర్షిక :  నిజ చెలికాడు .
కవిత సంఖ్య : 193

అమృత మూర్తులైన  
అమ్మానాన్నల పెంపకమో ... 
గురుతరముల  గుంభనాలైన 
గురువుల బోధనలో ..... 

మమతలతో నింపిన 
మరువలేని క్రమశిక్షణలో ....  
బాధ్యతల నిర్వహణల జాడలలో... 
నిరంతరాయంగా....పాటించిన... 

నిక్కచ్చి సమయపాలనలు  
నిష్పక్షపాత  కాల నియమాలు 
స్వల్ప ... దీర్ఘకాల ప్రణాళికలతో 
నీతి నియమాలు నిండిన గమనాలతో 
నిర్దుష్టమైన గమ్యాలు చేరడానికి .... 

ఎప్పటికప్పుడు సవివరమైన  
విషయ వివరణలతో సద్భావనల 
సంపత్తులు నిండిన చిత్తశుద్ధి ...... 
అవిరళమైన దృఢ దీక్షతలతో .... 

ఎల్లలెరుగని విజ్ఞానాలలో .... 
అవసరార్థం పుష్కలావరణం 
చేసుకున్న వివేచనల విహంగాలను  
అంటిపెట్టుకున్న .... ఆలోచనలు...  

ధర్మం తప్పని అడుగులువేయిస్తూ 
మాతృ దేశపు సత్సంప్రదాయాల 
తోటలో పరిమళాలు అద్దుకుంటూ 
మార్గనిర్దేశం చేస్తున్న నిజ చెలికాడు ..... 

నగునూరి రాజన్న 

కరినగరము  

No comments:

Post a Comment