పొద్దు పొడుపు
తేది: 22-11-2021
శీర్షిక : విజ్ఞాన వెలుగులు ...
కవిత సంఖ్య : 69+12
నిశి చీకట్లను పారద్రోలుతూ
పక్షుల కిలకిలా రవములతో
ఆహ్వానములంపఁగా ....
వసి వాడని వెలుగులు
ప్రసరించే ఉషోదయానా...
సప్తాశ్వారథ మారూఢుడై
వెలుగు పూలు వెదజల్లుతూ
నులి వెచ్చని పొద్దు పొడుపు కిరణాల
పలకరిస్తూ ... సర్వ విశ్వాన్ని
మేలుకొలిపే వేళ .....
పచ్చ తివాచీలపై పరుచుకున్న
వింత గొలిపే బిందువుల్లాంటి
మంచు ముత్యాలను సృశిస్తూ
మెల్లమెల్లగా వేడెక్కే వేళా .....
మసక చీకట్లను తొలిగించుకుని
పల్లె తల్లి ఒడిలో గెంతులేసే
లేగ దూడలు ...వాకిళ్ల కళ్ళాపి
జల్లి రంగవల్లులతో ముస్తాబు
చేసే మహిళా మణులు ....
జీవరాశిలో మిన్నంటూ
విర్రవీగే మానవాళి కూడా ....
అజ్ఞానపు చీకట్లను తరిమేసి
విజ్ఞానపు వెలుగు బీజాలను
పాదుకొల్పుకో గలిగితే పావనమే
ఇక విశ్వాన ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment